🏠 telanganadailynews.in
Watermark
Newspaper Logo
telanganadailynews.in | Date: 17 Jul, 2026 | Page: 1

రంగారెడ్డి జిల్లాలో విషాదం..

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో ఇద్దరు పిల్లలను బావిలో తోసి, తల్లి ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన వసంత (35), సుధాకర్ దంపతులు కొత్తపల్లికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురు (15), కొడుకు (10) ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి గొడవ జరగడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని వసంత బయటకు వచ్చేసింది.
అనంతరం ఊరి చివర ఉన్న బావిలో ఇద్దరు పిల్లలను తోసేసింది. అనంతరం తాను బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. అయితే బావిలో తోసినప్పుడు బాలుడు చెట్టు కొమ్మకు చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.
🏠 Home